అన్నారుగూడెం సర్పంచ్ ఉప సర్పంచ్ లకు ఘన సన్మానం

★ తిగుళ్ళ కేశవులు,జానీ కుటుంబ సభ్యులు ఆత్మీయతతో

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 27, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మండలం అన్నారుగూడెం గ్రామానికి చెందిన తిగుళ్ల కేశవులు మరియు జానీ కుటుంబాలు తిరువూరు మండల కేంద్రంలో వివిధ వ్యాపారాలతో స్థిరపడ్డారు.వారి స్వంత గ్రామం అన్నారుగూడెంలో ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గొడ్ల ప్రభాకర్,ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావులను వారి గృహాలకు తమ ఆత్మీయ నాయకులను సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. అన్నారుగూడెం గ్రామానికి ప్రాతినిధ్యం వహిస్తూ వ్యూహాత్మకమైన శైలితో పంచాయతీని కైవసం చేసుకున్న గ్రామ నిర్దేశికుడు తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావును అభినందిస్తూ సీనియర్ నాయకులు రాజకీయాల్లో అపారమైన అనుభవం కలిగిన నాయకులు మన ఉప సర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయాలని కోరుతూ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావును ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, సర్పంచ్ గొడ్ల ప్రభాకర్, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వరరావు, నాయకులు దొడ్డ చిన్న శ్రీనివాసరావు,మారెళ్ళ దేవేందర్,తుమ్మలపల్లి వెంకటేశ్వరరావు, లక్ష్మణ్,కేశవులు,జానీ కుటుంబ సభ్యులు ఉన్నారు.