పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ( జనగాం ప్రతినిధి కమ్మగాని నాగన్న)నిరుపేద లకు నిలువ నీడ కల్పించాలన్న సంకల్పం తోప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించిందనిఈ పథకం ద్వారా జిల్లా లో లబ్ధిదారులకు మంజూరు అయిన ఇళ్ల ను వేగవంతం గా నిర్మాణం అయ్యేలా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ప్రత్యేక శ్రద్ద వహించడం తో నేడుమంజూరు అయిన ప్రతీ ఇళ్ళునిర్మాణం లో వివిద దశల్లో సాగుతున్నాయి మంజూరు అయిన ఇళ్లను త్వరగా గ్రౌండింగ్ చేస్తూ రాష్ట్ర స్థాయి లో జిల్లా ను ప్రధమ స్థానం లో నిలబడేందుకు చేసిన కృషి చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వం ప్రకటించిన ఆరు గ్యారంటీ లలో ఒకటైన ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంత ఇళ్ల కల నెరవేర్చడం కోసం పక్క కార్యాచరణ తో ముందుకెళ్ళాము నిరుపేద లకు మాత్రమే లబ్ది చేకూరెలాఅర్హులైన వారిని ఎంపిక చేయడం నుండి మెదలుమంజూరు అయిన ప్రతీ ఇళ్ళు నిర్మాణ దశ లోకి వచ్చేందుకుప్రభుత్వ మార్గదర్శకాలను తూ. చ తప్పకుండ అమలు చేస్తున్నామని తెలిపారు ఒక్కో మండలం వారీగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లు ఎన్ని, వాటిలో ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయి, ఎన్ని ఇండ్లు ఏ దశలో నిర్మాణంలో ఉన్నాయి, గ్రౌండింగ్ జరగని ఇళ్లకు సంబంధించి పలుమార్లు రివ్యూ లు చేయడం తో పాటులబ్ధిదారులచే పనులు ప్రారంభించేలా చేపట్టిన చర్యల వల్లనేడు రాష్ట్ర స్థాయి లో గ్రౌండింగ్ లో జిల్లా ప్రధమ స్థానం లో నిలబడిందినిర్దేశిత లక్ష్యాల సాధన కోసం స్పష్టమైన దిశానిర్దేశం చేయడం తో పాటు పథకం ప్రారంభించినప్పటి నుండి మండల స్పెషల్ అధికారులను, తహసీల్దార్ లను, సంబంధిత శాఖ అధికారులను ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిశీలన కు పంపడం వల్ల మంజూరు అయిన ఇళ్ల నిర్మాణాలు వేగవంతం గా అయ్యాయి ప్రతి ఒక్కరూ ఇంటి నిర్మాణం పనులు చేపట్టడానికి, ఇందిరమ్మ కమిటీల సహకారం కూడా దోహద పడిందన్నారు జిల్లాల్లో రెండు విడతల్లో5834 ఇళ్ళుమంజూరు కాగా ఇప్పటివరకు 5206 ఇళ్ళు నిర్మాణ దశ లో ఉండగా33 ఇళ్ళు పూర్తి అయ్యాయి 4499 మంది లబ్ధిదారులకు వివిధ దశల వారీగా డబ్బులు పడ్డాయి ప్రభుత్వం చేపట్టే ప్రతీ సంక్షేమ పథకంప్రతీ గడప కు చేరేలా పక్క కార్యాచరణ రూపొందిస్తూవివిధ శాఖల అధికారులను భాగస్వామ్యం చేయడంతో పాటుక్షేత్ర స్థాయి లో కూడా పక్కాగా అమలు అయ్యేందుకు నిరంతర పర్యవేక్షణ మూల కారణమని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు