ఇల్లంతకుంట గ్రామపంచాయతీ నూతన పాలకవర్గానిక్ సన్మానం

పయనించే సూర్యుడు న్యూస్ :డిసెంబర్ /27:నియోజకవర్గం రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం. శ్రీ కృష్ణ గోశాల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం ఇల్లంతకుంట మండల కేంద్రానికి చెందిన గ్రామపంచాయతీ నూతన పాలక వర్గానికి సన్మానం చేయడం జరిగినది.ట్రస్ట్ చైర్మన్ అయ్యన్న హరికృష్ణా రెడ్డి అధ్యక్షతన జరిగిన సన్మాన కార్యక్రమంలో నూతన సర్పంచుగా ఎన్నిక యిన మామిడి రాజు ను,ఉపసర్పంచ్ మూగ నాగరాజు శర్మ ల తోపాటు వార్డ్ సభ్యులను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ ట్రస్ట్ ఉపాఢ్యక్షుడి నయిన నాకు ముప్పయి మూడు దేవతలకు నిలయమయిన గోమాత ల సమక్షములో సన్మానం జరుగడం అదృష్ట భాగ్యం అన్నారు. గోశాలకు అన్ని రకాల సహాయ సహకారాలు అందజేస్తామని పేర్కొన్నారు. ఉప సర్పంచ్ నాగరాజు శర్మ మాట్లాడుతూ సృష్టిలో ముగ్గురు మాతలు ముఖ్యమని ,వారి గొప్పదనం చాలా ఉందని అందులో భూమాత, గోమాత, మనకు జన్మనిచ్చిన తల్లి వీరు లేనిది సృష్టి లేదన్నారు. ట్రస్ట్ ఛైర్మెన్ హరికృష్ణా రెడ్డి మాట్లాడుతూ. గోసేవ భాగ్యం లభించడం పూర్వజన్మ సుకృతమని గోమాత సేవ చాలా శ్రేష్టమని ,పర్యావరణ సమతుల్యత ను కాపాడటంలో గోవుల పాత్ర ఆమోఘమన్నారు. పూర్వీకులు మనకు అందించిన గోవుల ద్వారా సేంద్రీయపద్దతిలో వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. మాజీ సర్పంచ్ కూనబోయిన బాలరాజు మాట్లాడుతూ గోవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షులు నార్ల రాంకిషన్, బోనగిరి రాము, నారెడ్డి, కిశోర్ రెడ్డి, మహేందర్ రెడ్డి,కేసరి కనకయ్య,చిట్టి ప్రదీప్ రెడ్డి మంద చక్రధర్ రెడ్డి, వార్డ్ సభ్యులు రేగుల కార్తీక్, రాకం సుమన్, మామిడి శ్రీనివాస్, ఎర్రోజు దీపిక రవితేజ, దయ్యాల శ్రీలత మహేష్,కొట్టే ప్రమీల వెంకన్న,మామిడి సుశీల, చేరాల వంశీ, అంతటి శ్రీకాంత్, గో మాతా సేవకులు వజ్జపల్లి మల్లేశం, కట్ట ఎల్లారెడ్డి,రాజస్థాన్ గణేష్, బత్తినిఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *