పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీకాలనీ 27:- రామగుండం-3 ఏరియాలోని ఓ.సి.పి-2 ఉపరితల గని ఆవరణ లో శుక్రవారం నాడు ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమంలో భాగంగా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ పొందనున్న రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకర రావు, సేవా అధ్యక్షురాలు అలివేణి సుధాకర రావు లను ప్రాజెక్ట్ ఆఫీసర్ జె.రాజశేఖర్, ఇతర అధికారులు, కార్మిక సంఘాల నాయకులు, ప్రజా ప్రతినిధులు, అన్ని విభాగాల ఉద్యోగులు, కాంట్రాక్టు ఉద్యోగులు ఘనంగా సన్మానించారు.ఉద్యోగ విరమణ అనంతరం వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో గడపాలని వారు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా జి.ఎం మాట్లాడుతూ ఓసీ-2 ఉపరితల గని విస్తరణ కోసం చేపట్టిన భూసేకరణ పనులకు నాకు సహకరించిన రాష్ట్ర ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కి, పరిసర ప్రాంతాల ప్రజలు, ప్రజా ప్రతినిధులకు, కార్మిక సంఘాల నాయకులకు, అధికారులకు, ఉద్యోగులకు, ప్రభుత్వ అధికారులకు, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే అందరు కలిసి కట్టుగా పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను భద్రతతో సాధించుకోవాలని, సంస్థకు నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు యం.రామచంద్ర రెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షుడు కోల శ్రీనివాస్, ప్రాజెక్ట్ ఇంజినీర్ చంద్రశేఖర్, ఇంచార్జ్ మేనేజర్ సంపత్, పిట్ సెక్రెటరీలు సురేష్, రామిల్ల మనోహర్, లద్నాపూర్ గ్రామ సర్పంచ్ వనం రామచంద్ర రావు,పాల్గొన్నారు.