ఎమ్మెల్యేని సన్మానించిన బిజ్వారం శ్రీనివాస్ రెడ్డి సర్పంచ్

పయనించి సూర్యుడు తేదీ 27 డిసెంబర్ శుక్రవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. ఈరోజు గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో స్థానిక సంస్థల ఎన్నికల భాగంగా మల్డకల్ మండలం పరిధిలోని బిజ్వారం గ్రామంలో సర్పంచ్ ఎన్నికలలో శైలజ శ్రీనివాస్ రెడ్డి సర్పంచి గెలుపొందారు. సందర్భంగా గద్వాల ఎమ్మెల్యే శ్రీ బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మర్యాదపూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, సీనియర్ నాయకులు పటేల్ ప్రభాకర్ రెడ్డి, సత్యం రెడ్డి, మాజీ PACS ఛైర్మన్ తిమ్మారెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.