పయనించే సూర్యుడు ఉట్నూర్ డిసెంబర్ 27 ఉట్నూర్ మండలంలోని చాందూరి–హస్నాపూర్ రహదారి పూర్తిగా శిథిలావస్థకు చేరింది రోడ్డంతా భారీ గుంతలు ఏర్పడటంతో పాటు కంకర తేలి ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి నెలకొంది కనీసం నడుచుకుంటూ వెళ్లడానికి కూడా వీలులేని స్థితిలో రహదారి తయారైందని స్థానికులు వాపోతున్నారు వర్షాల సమయంలో గుంతల్లో నీరు నిలిచి ప్రమాదాల ముప్పు మరింత పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ మార్గంలో పాఠశాల విద్యార్థులు రైతులు, రోగులు తరచూ ప్రయాణిస్తుండటంతో సమస్య తీవ్రంగా మారింది సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టి ప్రజలకు ఉపశమనం కలిగించాలని గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.