కాంగ్రెస్ నాయకులది అర్బాటం తప్పా చేసింది ఏమి లేదు బీఆర్ఎస్ హయాంలో మంజూరైన పనులకే మల్లి పేర్లు

పయనించే సూర్యుడు 27 డిసెంబర్ 2025 భీంగల్ మండల్ ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి, నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణం లో బిఆర్ఎస్ పార్టీ నాయకుల ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో భీంగల్ పట్టాణానికి చేసింది ఏమి లేదని, రెండేండ్లలో తట్టేడు మన్ను కూడ పోయలేదని బీఆర్ఎస్ పార్టీ నాయకులు బోదిరే నర్సయ్య, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గున్నాల భగత్ విమర్శించారు. గురువారం భీంగల్ పట్టణంలోని ఎల్జే ఫంక్షన్ హాల్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. 2013 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రి గా ఉన్న వేముల ప్రశాంత్ రెడ్డి మున్సిపల్ అభివృద్ధి కొరకు రూ 25 కోట్లు మంజూరు చేయడం జరిగిందని గుర్తు చేశారు. తరువాత 8 ఆగస్ట్ 2023 న పట్టణంలోని వివిధ అభివృద్ధి పనుల కొరకు రూ 10 కోట్లతో జీవో ను అప్పటి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విడుదల చేయించారని పేర్కొన్నారు. అట్టి జీవో ద్వారా పట్టణం లోని వివిధ వార్డ్ ల్లో అభివృద్ధి పనులను గుర్తించడం, గుర్తించిన పనులకు టెండర్లు వేయడం జరిగిందని తెలిపారు. తీరా కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత టెండర్లు అయిన పనులను అగ్రిమెంట్ కాకుండా నిలిపి వేయడం జరిగిందని పేర్కొన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఈ సమావేశం లో బీఆర్ఎస్ నాయకులు సతీష్ గౌడ్, మల్లెల ప్రసాద్, మూత లింబాద్రి, రాజు నాయక్, పతాని లింబాద్రి, నల్లూరి లింబాద్రి, ఇక్రమ్, రతన్ రాజ్, అశోక్, రామకృష్ణ, చరణ్, సాదు, సునిల్, సాగర్, చింటూ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *