కాంగ్రెస్ లో చేరిన పచ్చునూరు సర్పంచ్

పయనించే సూర్యుడు న్యూస్ :డిసెంబర్ /27 నియోజకవర్గం రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :మానకొండూర్ మండలం పచ్చునూరు గ్రామ సర్పంచ్ పార్నంది కిషన్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. శుక్రవారం ఎల్ఎండీ కాలనీలోని ప్రజాభవన్ లో ఆయనకు మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సర్పంచ్ కిషన్ తోపాటు వార్డు సభ్యులు తాళ్ల వెంకటేశ్, నెలవేణి సుశీల, కోమల్ల నరేష్ లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ పచ్చునూరు గ్రామ సమగ్ర అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. గ్రామ అవసరాల మేరకు చేపట్టే అభివృద్ధి పనులకు అధిక నిధులు కేటాయిస్తానన్నారు. గ్రామాభివృద్ధికి సహాయ సహకారాలు అందజేస్తానని ఆయన హామీ ఇచ్చారు. పంచాయతీ నూతన పాలకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి పాటుపడాలని, ముఖ్యంగా విద్యుత్,పారిశుద్ధ్యం,డ్రైనేజీ వ్యవస్థ మెరుగుపర్చడం, మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పచ్చునూరు ఉప సర్పంచ్ మూడగాని అనిల్, వార్డు సభ్యులు పిట్టల సువర్ణ, పిట్టల మల్లేశం, దాసారం అనిత, పూసాల సతీష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముద్దసాని శ్రీనివాస్ రెడ్డి, రామిడి శ్రీనివాస్ రెడ్డి,రొంటాల లక్ష్మారెడ్డి,బుర్ర శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.