కాకినాడ జిల్లా టిడిపి కార్యనిర్వాహక కార్యదర్శిగా చదరం చంటిబాబు

★ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జిల్లా అధ్యక్షుడు జ్యోతుల నవీన్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన చంటిబాబు

పయనించే సూర్యుడు డిసెంబర్ : 27 జగ్గంపేట నియోజకవర్గ ఇంచార్జి కె సాయి దుర్గ తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శిగా నియమితులైన కిర్లంపూడి మండలం జగపతినగరం గ్రామానికి చెందిన చదరం చంటిబాబు శుక్రవారం జగ్గంపేట మండలం ఇర్రిపాకలో జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూను, కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని ఘనంగా సత్కరించి ఆశీస్సులు తీసుకున్నారు.ఈ సందర్భంగా చంటిబాబు మాట్లాడుతూ, తనపై నమ్మకంతో జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్‌లకు కృతజ్ఞతలు తెలిపారు. వారి సహకారంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని మరింత పటిష్టపరిచి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి విజయానికి నిరంతరం కృషి చేస్తానని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కిర్లంపూడి ఎంపీపీ తోట రవి, సొసైటీ చైర్మన్‌లు కుర్ల చిన్నబాబు, తోట గాంధీ, తూము కుమార్, భూపాలపట్నం ప్రసాద్, గుడాల రాంబాబు, కాళ్ళ వెంకటేష్, బోదిరెడ్డ్ల సుబ్బారావు, విద్యా కమిటీ చైర్మన్ ఆళ్ళ బాబులు, గండే కాశీ, గొల్లపల్లి సూరిబాబు, దాడి గోవింద్, మళ్ళ రమేష్, యడ్ల కృష్ణ, ఆళ్ళ దుర్గాబాబు, బాబీ తదితరులు పాల్గొన్నారు.