పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 27 అనంతసాగరం మండలం, నెల్లూరు జిల్లా (రిపోర్టర్: వెంకటరమణారెడ్డి) నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యాక్టివిటీ సెక్రటరీ బట్రెడ్డి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు ఇచ్చిన కోటి సంతకాల తీర్పు విజయం సాధించిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి 40% ఓట్ బ్యాంక్ ఉందని హర్షం వ్యక్తం చేశారు. 2029లో వచ్చేది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అని రాష్ట్ర ప్రజలకు విద్య, వైద్యం ఎప్పటికీ అందుబాటులో ఉంటుందని ధీమాగా అన్నారు. కూటమి ప్రభుత్వం ఎన్ని పన్నాగాలు పన్నిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ధైర్యంగా ఎదుర్కొని తిప్పి కొడుతుందన్నారు అన్నారు.కూటమి ప్రభుత్వం మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ వెనక్కి తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ కూటమి గుండెల్లో గుభేలు పుట్టించిందని ఒక్కరూ కూడా భయపడి టెండర్లలలో పాల్గొనలేదని హర్షం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో కోటి సంతకాలకు కష్టపడ్డ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.