కేబుల్ కిషన్ వర్ధంతిలో పాల్గొని నివాళులఅర్పించిన తెలంగాణ రాష్ట్ర ముద్దిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్

పయనించే సూర్యుడు న్యూస్ 27 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ పొరాటయోధుడు,పేదల ఆరాధ్యదైవం కామ్రేడ్ కెవల్ కిషన్ ప్రజలు ఒక వ్యక్తిని అభిమానిస్తే, గుండెల్లో పెట్టుకుని కొలుస్తారు అనడానికి నిదర్శనమే కెవల్ కిషన్ ఆయన పోరాటం నేటి తరానికి స్ఫూర్తి బోర జ్ఞానేశ్వర్ ముదిరాజ్, మహాసభ అధ్యక్షులు చెప్పరి శంకర్ ముదిరాజ్ మెదక్ జిల్లా అధ్యక్షులు పుట్టి రాజు ముదిరాజ్ మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి తలారి బిక్షపతి ముదిరాజ్ గుండ్లపల్లి శ్రీనివాస్ ముదిరాజ్ అల్లుడు, జగన్ ముదిరాజ్ మద్దెల సంతోష్ ముదిరాజ్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ పిట్ల నాగేష్ ముదిరాజ్ ఘనంగా కెవల్ కిషన్ వర్ధంతి. పేదల సంక్షేమం కోసం పరితపించిన పోరాట యోధుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని శుక్రవారం కేవల్ కిషన్ వర్ధంతి పూలు వేసి ఘన నివాళులు అర్పించారు, మెదక్ జిల్లా చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో స్వర్గీయ కేవల్ కిషన్ ముదిరాజ్ స్మారకర్తము నిర్మించిన సమాధి వద్ద ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతి రోజున నిర్వహించే జాతర ఎంతో ప్రసిద్ధి చెందింది అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజల హక్కుల కోసం పోరాటం చేసి ప్రజల కోసం ప్రాణాలర్పించిన మహనీయుడు కేవల్ కిషన్ అన్నారు. మెదక్ ప్రాంతంలోని జమిందారుల ఆగడాలతో విసిగి వేసారిన పేదలను ఒక్కటి చేసి ప్రజాపోరాటాలు నిర్వహించారని తెలిపారు.దున్నేవాడికే భూమి అంటు భూ పోరాటాలు చేసి పేదలకు భూములు పంచిపెట్టారని కొనియాడారు. అలాగే కార్మికుల కోసం అనేక పోరాటాలు చేసి హక్కుల సాధనకు కృషి చేశాడన్నారు. అలాంటి మహనీయున్ని ప్రజలు స్మరించుకుంటు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి చుట్టూ ఎడ్లబండ్లను తిప్పుతూ జాతరను చేయడం ప్రశంసనీయమని తెలిపారు. ప్రజల కోసం జీవించి ప్రాణాలర్పించిన మహనీయులని ప్రజలు తమ గుండెల్లో పెట్టుకొని కొలుస్తారనడానికి నిదర్శనమే కెవల్ కిషన్ పోరాటం అన్నారు. అలాంటి మహనీయుని స్ఫూర్తిగా తీసుకొని నేటి యువతరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో , ముదిరాజ్ నాయకులు గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *