ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో బాధ్యత రహితంగా వ్యవహరిస్తున్న ఉద్యోగస్తులు

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు, సిబ్బంది మరియు అధికారులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తుండటంతో రోగులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులలో నిర్లక్ష్యం, సకాలంలో వైద్యం అందకపోవడం ఇబ్బందులకు లోన్ అవుతున్నారు, ఆసుపత్రుల్లో అపరిశుభ్రత వంటి సమస్యలు పెరిగిపోతున్నాయి, వైద్యులు సొంత క్లినిక్‌లకే ప్రాధాన్యత ఇస్తుండటంతో, సర్కారు దవాఖానాలకు వస్తున్న రోగులకు సరైన సేవలు లభించడం లేదు. నిర్లక్ష్య వైఖరి క్షేత్రస్థాయి ఉద్యోగస్తులు వైద్యులు ఆసుపత్రుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కొందరు ప్రభుత్వ వైద్యులు తమ విధులను విస్మరించి, సొంత క్లినిక్‌లపై దృష్టి పెడుతున్నారని విమర్శలు వస్తున్నాయి. జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా మారాయి. మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆశించే పేదలకు నిరాశే మిగులుతున్నది. రూ.కోట్లు వెచ్చిస్తున్నా సర్కారు పేదలకు మాత్రం వైద్యం అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ వైద్యం.. అందని దైన్యం అధ్వానంగా ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు సమయానికి వైద్యులు రాక ఇబ్బందులు పడుతున్న రోగులు, వారానికి ఒకరోజు మాత్రమే విధులకు హాజరవుతున్న వైద్యులు జిల్లా దవాఖానలో పారిశుధ్యం అస్తవ్యస్తం మందులు బయటే కొనాలని చెబుతున్న డాక్టర్లు అనే విషయం బాగా జిల్లా వ్యాప్తంగా వినపడుతున్న సమాచారం రోగికి తప్పని తిప్పలు ఇంకా ఎన్ని రోజులు ఇలా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో తనిఖీలు చేసే అధికారులు ఉన్నారా లేరా అనే సందేహం కలుగుతుంది సరైన సౌకర్యాలు లేకపోవడం సమయానికి వైద్యులు రాకపోవడం వంటి కారణాల వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారు రోగి హాస్పటల్ కొచ్చి నడిచే పరిస్థితి లేకపోతే పేషెంట్ ను స్ట్రక్చర్ మీద కానీ వీల్ చైర్ మీద తీసుకువెళ్లే నాధుడే కరువయ్యాడు మీ పేషెంట్ ను మీరే స్ట్రక్చర్ మీద కానీ వీల్ చైర్ మీద నెట్టుకొని తీసుకెళ్లాలి మేము తీసుకెళ్లాము అనే నిర్లక్ష్యపు సమాధానం ప్రభుత్వ హాస్పటల్లో వైద్యులు అధికారులు క్షేత్రస్థాయి ఉద్యోగస్తులు పట్టించుకోకపోవడంతో పేషెంట్ ను కుటుంబీకులే వీల్ చైర్ మీద తీసుకెళ్లే పరిస్థితి ఏర్పడింది జిల్లా ఉన్నతాధికారులు ఇటువంటి నిర్లక్ష్యపు సమాధానం నిర్లక్ష్యంగా బాధ్యతరహితంగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోకపోవడం వల్లనే ప్రభుత్వాసుపత్రుల మీద ఎంతో కొంత ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతున్నారు నిర్లక్ష్యంగా బాధ్యతరహితంగా విధులు నిర్వహిస్తున్నటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడం మర్చిపోయారు అందుకే క్షేత్రస్థాయి ఉద్యోగస్తులు మితిమీరి హద్దులు దాటుతున్నారు మరి వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారులు ఉన్నారా లేరా అనేది వేచి చూడాలి మరి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *