పయనించే సూర్యుడు: డిసెంబర్ 27, అనంతపురం జిల్లా గుత్తి మండలం రిపోర్టర్: బి నిజాముద్దీన్ వార్తా విశ్లేషణ:అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీ లో కర్నూల్ రోడ్ లోని సిపిఐ పార్టీ ఆఫీసు నందు పట్టణ కార్యదర్శి రాజు అధ్యక్షతన మండల కార్యదర్శి రాందాస్ ఆధ్వర్యంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆవిర్భావ దినోత్సవ పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది . ఈ సందర్భంగా సీనియర్ కామ్రేడ్ డానియల్ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారతదేశపు గడ్డమీద సిపిఐ కి వంద సంవత్సరాల అనే నినాదంతో దేశమంతా ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా గుత్తి పార్టీ ఆఫీసులో కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం అని ఉత్తర ప్రదేశ్ లోనే కాన్పూర్లో ఆవిర్భవించి అప్పటినుండి ఇప్పటివరకు స్వతంత్ర పోరాటంలో అదేవిధంగా ప్రజలకు కావాల్సిన కూడు గుడ్డ నీడ దున్నేవానికి భూమి కావాలని నిరంతరము ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీ వీరులను స్మరించుకోవడం జరిగినది. ఈ కార్యక్రమంలో సిపిఐ నియోజకవర్గం సహాయ కార్యదర్శి రమేష్ బాబు మండల సహాయ కార్యదర్శి వెంకట్ రాముడు పట్టణ సాయ కార్యదర్శిలు మహమ్మదా నజీర్ మధుసూదన్ రావు ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు ఆర్బి రామంజి ,సురేష్ ,భాష, రామకృష్ణ ,షఫీ గోపాల్ బెస్తగిరి, కుమార్ ,నూర్జహాన్, మళ్లీ ,ఓబులేష్ తదితరులు పాల్గొనడం జరిగింది