ఘనంగా క్రిస్మస్ వేడుకలు

★ కల్వరి టెంపుల్ ఆర్.నెల్సన్ ఆధ్వర్యంలో. ★ క్రైస్తవం ఒక మతం కాదు జ్ఞాన, మహా యజ్ఞ గ్రంథం. ఫాదర్ ఆర్. నెల్సన్.

పయనించే సూర్యుడు: డిసెంబర్ 27 హుజురాబాద్ టౌన్ రిపోర్టర్ దాసరి రవి : క్రీస్తు జన్మదిన కావున ఉదయం నుంచే క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నూతన వస్త్రాలతో చర్చిలలో ప్రవేశించారు. పిల్లల నాట్యాలతో యూత్ స్కిట్స్ తో క్రీస్తు పుట్టిన నాటికలతో క్రైస్తవులను ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలకు ప్రత్యేక ఆహ్వానితులుగా రాంపూర్ సర్పంచ్ ముషం సంగీత గణేష్, రంగాపూర్ సర్పంచ్ కుంట అరుణ తిరుపతి రెడ్డిలు హాజరయ్యారు. ఇరు గ్రామాల సర్పంచులు మాట్లాడుతూ క్రిస్మస్ రోజు మేము చర్చిలో గడపడం గొప్ప ఆనందంగా ఉందని, క్రీస్తు పుట్టుక ప్రజలకు చాలా మేలు చేసిందని బైబిల్ ప్రవచనాలు సత్ప్రవర్తనకు ఎంతో దోహదపడతాయని తెలిపారు.చర్చి ఫాదర్ నెల్సన్ మాట్లాడుతూ ఈ డిసెంబర్ 25 క్రీస్తు పుట్టిన రోజు ఒక భారత దేశంలోనే కాకుండా ప్రపంచమంతా ఒకేరోజున జరుపుకుంటారని,క్రైస్తవం ఒక మతం కాదని ఒక చక్కని మార్గమని, బైబిల్ ఒక మత గ్రంథం కాదని ఒక మహా జ్ఞాన గ్రంథం అని బోధిస్తూ వివరించారు. హాజరైన పేద వితంతులకు రాజారత్నం కమల కుటుంబం 15 మందికి సర్పంచుల చేతులమీదుగా చీరలు పంపిణీ చేశారు. సర్పంచులను మరియు చర్చి సభ్యులు బండ మాధవి రమేష్ వార్డ్ మెంబర్ గా గెలిచినందుకు సంఘ సభ్యులు ఘనంగా సత్కరించారు. చర్చి ఫాదర్ నెల్సన్ చేస్తున్న మంచి కార్యక్రమాలను బట్టి సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు ఫాదర్ నెల్సన్ సుధీన దంపతులను సన్మానించారు. అనంతరం చర్చి ఫాదర్ తో సహా అతిథులు అందరు కలిసి కేక్ కట్ చేసి అందరికీ పంపిణీ చేశారు. క్రైస్తవుల తో పాటు హాజరైన ప్రతి ఒక్కరికి క్రిస్మస్ విందును ఏర్పాటు చేశారు. పట్టణంలోనే కాకుండా అలాగే వివిధ గ్రామాల్లో ఘనంగా క్రిస్మస్ వేడుకలను నిర్వహించారు.