చౌడేపల్లె లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు

★ క్రీస్తు పరిమళ పరిచర్య ప్రార్థన మందిరం (చర్చి) పాస్టర్ ఎస్. ప్రభుదాస్ మెర్సి (మీనా కుమారి) వారి ఆధ్వర్యంలో క్రైస్తవులు ప్రార్థనలు జరిపారు ★ ప్రత్యేక దుస్తుల్లో ఆకట్టుకున్న చిన్నారులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ★ పెద్ద ఎత్తున భక్తులకు ఉచిత మహా అన్నదాన కార్యక్రమానికి విశేష స్పందన

పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ డిసెంబర్ 27.12.2025 చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ 0 చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) చౌడేపల్లి మండల కేంద్రంలోని క్రీస్తు పరిమళ పరిచర్య ప్రార్థన మందిరం (చర్చి) లో గురువారం ఉదయం నూతన వస్త్రాలు ధరించి బైబిల్ తీసుకెళ్లి చర్చిలో ప్రార్థనలు జరిపారు చర్చి పాస్టర్ (ప్రభుదాస్) మాట్లాడుతూ క్రిస్మస్ పండుగ శాంతి ప్రేమ సోదర భావం త్యాగం వంటి విలువలను సమాజానికి గుర్తు చేస్తుందని ప్రపంచానికి శాంతి సందేశాన్ని అందించేందుకు ఏసుప్రభు జన్మించారని ద్వేషించే వారిని సైతం ప్రేమించాల నే సందేశమే మానవాళికి ఏసుక్రీస్తు బోధన అని తెలియజేశారు ఏసుక్రీస్తు జన్మ వృత్తాంతాన్ని తెలిపి పలు నాటకాలు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థుల చేత ప్రదర్శించి ఏసుక్రీస్తు శాంతి సందేశ 0 సారాంశాన్ని తెలియజేశారు క్రిస్టియన్ సోదర సోదరీమణులు మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అని ఒకరికొకరు శుభాకాంక్షలు తెలియజేశారు తదనంతరం పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు భారీక్రిస్మస్ కేక్ ను కటింగ్ చేసి భక్తులకు పంచిపెట్టారుఉచితమహా అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి భక్తులకు పంపిణీ చేశారు ఈ కార్యక్రమా లు చర్చి పాస్టర్ ఎస్ ప్రభుదాస్ మెర్సి (మీనాకుమారి) వారి ఆధ్వర్యంలో జరిగాయి