డిండి డిసిసి క్రికెట్ క్లబ్ ఆధ్వర్యంలో సర్పంచ్ నల్లగంతుల రవికి ఘన సన్మానం

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 ( ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి నల్లగంతుల రవి సర్పంచ్ గా ఎన్నిక కావడం జరిగింది. ఈ సందర్భంగా శుక్రవారం డిసిసి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సర్పంచ్ నల్లగంతుల రవి మాట్లాడుతూ నా యొక్క గుర్తింపు డిండి క్రికెట్ క్లబ్ నుంచి వచ్చిందని, పూర్వ అనుభవాలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి సభ్యులు ఎంఏ కలీం, ఏటి కృష్ణ, జయవర్ధన్, గడ్డమీది సాయి, కిట్టు,ప్రశాంత్, రవిశంకర్, రహమద్ ఖాద్రి, బాల్రాజ్, శోభన్,సాయి , వంశీ, శ్యామ్, అంజి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.