తల్లాడ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు సభ్యులకు ఘన సన్మానం చేసిన టీడీపీ అభిమాని కొమ్మినేని రామయ్య

పయనించే సూర్యుడు న్యూస్ : డిసెంబర్ 27, తల్లాడ రిపోర్టర్ తల్లాడ మేజర్ గ్రామ పంచాయితీ సర్పంచ్ ఉపసర్పంచ్, వార్డు మెంబర్స్ కి టీడీపి వీరబిమని కొమ్మినేని రామయ్య వారి గృహానికి తమ ఆత్మీయ గ్రామ పంచాయితీ సర్పంచ్ పెరిక నాగేశ్వర రావు (చిన్నబ్బాయి), ఉపసర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, మరియు వార్డు సభ్యులను, ముఖ్య నాయకులని సాదరంగా ఆహ్వానించి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ముఖ్య అతిథులుగా మండల నాయకులు ధూపాటి భద్రరాజు, కూచిపూడి వెంకటేశ్వరరావు, సరికొండ శ్రీనివాసరాజు, కొమ్మినేని వెంకటేశ్వర్లు, కేతినేని చలపతిరావు, వారిని కుడా సన్మానించి అభినందించారు. తదనంతరం మిఠాయిలు పంచి తమ ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ సందర్భంగా సర్పంచ్ పెరిక. నాగేశ్వర రావు మాట్లాడుతూ తల్లాడ లో బి ఆర్ యస్ పార్టీ కి తెలుగదేశం పార్టీ మద్దతు తెలపడం వాళ్ళ ఈరోజు నాకు ఇంత మెజారిటీ నా విజయం చేకూరింది అని నా విజయానికి సహకరించిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు (చిన్నబ్బాయి), ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, టీడీపి మండల నాయకులు ధూపాటి భద్రరాజు, సరికొండ శ్రీనివాసరాజు, కూచిపూడి వెంకటేశ్వరరావు, అన్నారుగూడెం ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర రావు, అంజనాపురం ఉపసర్పంచ్ కేతినేని చలపతిరావు, వార్డు మెంబర్లు పెరిక.శ్రీలేఖ, పెరిక. స్వర్ణ లత,షేక్.కమల్, ముకర దోనే ష్, వెమిరెడ్డి చిన్న క్రిష్ణ రెడ్డి, గుంటుపల్లి. కుమారి, టీడీపి నాయకులు మొక్క. కృష్ణార్జున్, నారపోగు. ప్రసాద్, ఎండి హఫీజ్, కోమ్మినేని రాము, రావూరి రవిప్రసాద్, తుమ్మలపల్లి రామారావు, పెరిక కిట్టు, మొక్క. సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *