తూర్పు కాపుల రిజర్వేషన్ సమస్యల పై ప్రశ్నించాలని వైసీపీ నాయకులకు వినతిపత్రం

పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్,డిసెంబర్, 27:- పాలకొల్లు వైస్సార్సీపీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుచున్న తూర్పు కాపులు రిజర్వేషన్ సమస్య పైన నరసాపురం పార్లమెంటరీ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణం రాజు పాలకొల్లు నియోజవర్గం ఇంచార్జ్ గుడాల హరి గోపాల్ (గోపి) వినతి పత్రాన్ని అందజేసిన తూర్పు కాపు సంఘ నాయకులు. ఓ.బీ.సీ సమస్య పై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తూర్పు కాపు సంఘ అధ్యక్షులు లోపింటి చిరంజీవి, వైఎస్ఆర్సిపి పార్టీ స్టేట్ సెక్రటరీ డీసీఎంఎస్ మాజీ చైర్మన్ యడ్ల తాతాజీ, వాకాడ అప్పారావు,పాలకొల్లు వైస్సార్సీపీ పట్టణం అధ్యక్షులు కోరాడ శ్రీనివాసరావు, ఇజ్జాడా చిన్నబాబు జమ్ము కాశీ విశ్వనాథ్ జామాను బుజ్జి పాండ్రంకి శ్రీనివాస్ గొర్రెల రాంబాబు గేదెల నరసింహారావు నడిపూడి శ్రీనివాస్ రూమ్కానీ దుర్గారావు పైల శేఖర్ మీసాల దాన నర్సింహులు రోనంకి శ్రీనివాస్ మామిడి సత్యనారాయణ,తూర్పు కాపు ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.