ప్రజా పోరాటాలే పునాదిగా వందేళ్ళ ప్రయాణం

★ సిపిఐ శత వార్షికోత్సవ సభ లో ధనుంజయ నాయుడు వ్యాఖ్య

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) అధికారంతో సంబంధం లేకుండా ఓట్లతో సీట్లతో సంబంధం లేకుండా ప్రజా పోరాటాలే పునాదిగా చేసుకొని గత వంద సంవత్సరాలుగా భారత దేశంలో సిపిఐ పార్టీ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని సిపిఐ రాష్ట్ర కమిటీ సభ్యుడు ధూళిపాళ ధనుంజయ నాయుడు వ్యాఖ్యానించారు. సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మండల కేంద్రంలో సిపిఐ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో జరిగిన పార్టీ శతవార్షికోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ సిపిఐ పార్టీ ఒక స్వచ్ఛంద రాజకీయ సేవా సంస్థ అని ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా ప్రజలకు సేవ చేయాలే లక్ష్యంతో ఉన్నవాళ్లు మాత్రమే ఈ పార్టీలో సభ్యులుగా ఉంటారని స్వార్ధపరులు, కాంట్రాక్టర్లు లాంటి వారికి పార్టీలో స్థానం ఉండదని ఆయన స్పష్టం చేశారు. దేశంలో ఉన్న వివిధ వర్గాలైన విద్యార్థి యువజన మహిళా రైతు కార్మిక శ్రామిక రంగాలకు అండగా ఉండేందుకు దేశవ్యాప్తంగా అనేక ప్రజా సంఘాలు నిర్మించి, దేశంలోనే ఆదర్శంగా నిలిచిన మొట్టమొదటి పార్టీ సిపిఐ అని, జనాభాలో సగభాగమైన మహిళలకు చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్ కల్పించాలని పార్లమెంటు సాక్షిగా ఆనాటి సిపిఐ ఎంపీ గీతా ముఖర్జీ నాయకత్వంలో అనేక ఉద్యమాలు నిర్వహించి సాధించిన చరిత్ర సిపిఐ పార్టీది అని ఈనాడు దేశ జనాభాలో 50% పైగా ఉన్న బీసీలకు వారి హక్కుల కొరకు 42 శాతం రాజకీయ రిజర్వేషన్ కావాలని పోరాడుతున్న ఏకైక పార్టీ సిపిఐ అని సగర్వంగా ప్రకటించారు దేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ముందుగా ప్రకటించిన పార్టీ సిపిఐ అని భూమి కోసం భుక్తి కోసం శ్రమ దోపిడీ విముక్తి కోసం అలుపెరగని పోరాటాలు చేసి కార్మిక వర్గ శ్రేయస్సు కై పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నేడు కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం తొక్కిపెట్టిందని అయినా మళ్ళీ పోరాటలు కొనసాగిస్తామని కార్మికుల హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వానికి సమాధి కడతామని ఆయన అన్నారు కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు శ్రీను బీసీ హక్కుల సాధన సమితి జిల్లా సహాయ కార్యదర్శి కొమర్రాజు వెంకట్ ఏఐవైఎఫ్ పట్టణ అధ్యక్షుడు పరికే భరత్ దోమకొండ మనోజ్ ఉల్లెందుల దుర్గయ్య కల్లూరు సుబ్రహ్మణ్య చారి వెంకటాచారి రామస్వామి పాల్గొన్నారు