పయనించే సూర్యుడు డిసెంబర్ 27, 2(జనగామ ప్రతినిధి కమ్మగాని నాగన్న)దేవరుప్పుల మండలం పెద్దమడూరు గ్రామ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి రాములు తల్లి బీరమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించగా విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం బీరమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యం నింపారు. బీరమ్మ మృతి కుటుంబానికి తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి బిఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా నాయకులు బబ్బూరి శ్రీకాంత్ గౌడ్ ,పల్ల సుందర్ రామిరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు తీగల దయాకర్ మాజీ ఎంపీపీ కొల్లూరి సోమన్న మండల పార్టీ ఉపాధ్యక్షుడు నల్ల ఉమేష్ సర్పంచ్ పానుగంటి గిరి వార్డు సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు