బిసి నాయకులు పిల్లి రామ రాజు యాదవ్ పై అగ్రవర్ణ నాయకులు దాడి చేయడం అమానుషం

పయనించే సూర్యుడు న్యూస్ 27- 12- 25, నాగరాజు రుద్రారపు సూర్యాపేట టౌన్ రిపోర్టర్ టిఆర్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ నల్గొండ జిల్లా బిజెపి కార్యాలయం లో బిజెపి పార్టీ బిసి నాయకులు పిల్లి రామరాజు యాదవ్ పై బిజెపి జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలంగాణ రాజ్యాధికార పార్టి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టె జానయ్య యాదవ్ అన్నారు. సూర్యాపేట పట్టణం లోని పార్టీ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బిసి నాయకులు పిల్లి రామరాజు యాదవ్ కు వర్షిత్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పిల్లి రామ రాజు ఎదుగుదలను సహించలేకనే ఆయనపై అగ్రవర్ణ నాయకులు దాడికి పాల్పడినారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో బిసిలలో చైతన్యం వచ్చిందని, ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికలలో జనరల్ స్ధానలలో బిసిలు ఎస్సిలకు చెందిన నాయకులు పోటి చేసి అగ్రవర్ణ నాయకులపై గెలుపొందారని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ తో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 42% రిజర్వేషన్ లు అమలు చేయకుండా బిసిలను మోసం చేసిందని అన్నారు. రాబోయే ఎన్నికలలో ‌ బిసి, ఎస్సి, ఎస్టిలు , మైనారిటిలు ఏకమై అగ్రవర్ణాల నాయకులను ఓడించాలని ఆయన అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత ఎనభై ఏళ్ల నుండి రాష్ట్రం లో అగ్రవర్ణాల వారే పరిపాలన చేస్తున్నారని, రాబోయే ఎన్నికలలో అగ్రవర్ణ నాయకులను ఓడించి బి సి లు అధికారాన్ని చేపట్టాలని అన్నారు. బహుజన వర్గాల పై జరుగుతున్న కుట్రలకు వ్యతిరేకంగా బహుజన వర్గాల నాయకులు ఏకం కావాలని, తెలంగాణ రాజ్యాధికార పార్టి లో చేరాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికలలో అగ్రవర్ణాల నాయకులను ,పార్టిలను ఓడించే విధంగా టిఆర్ పి ఆద్వర్యంలో వ్యూహ రచన చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్పి మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, పట్టణ అధ్యక్షులు కుంభం నాగరాజు, మాజీ కౌన్సిలర్ అన్నేపర్తి రాజేష్,ఆత్మకూర్ (ఎస్)మండల పార్టీ అధ్యక్షుడు బొల్లె సైదులు, పెన్ పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, బోడపట్ల మధు, బాల్మీకి దీపంమాల, వర్రె కవిత, లింగాల సైదులు, ఆరాల రమేష్, సేవ్యా నాయక్, జానయ్య, జనార్ధన్ తదితరులు పాల్గొన్నారు.