పయనించే సూర్యుడు డిసెంబర్ 27 రాజన్న సిరిసిల్ల జిల్లా (స్టాఫ్ రిపోర్టర్ ఎమ్ ఎ షకీల్) వీర్ బాల్ దివస్ సందర్భంగా, భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షులు దుమాల శ్రీకాంత్ మాట్లాడుతూ వీర్ బాల్ దివస్‌ను ప్రతి సంవత్సరం డిసెంబర్ 26న జరుపుకుంటామని తెలిపారు. 1664 డిసెంబర్ 26న, కేవలం పదేళ్ల వయస్సులోనే ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలను అర్పించిన గురు గోబింద్ సింగ్ కుమారులు బాబా జోరావర్ సింగ్ వీరత్వం, ధైర్యం, ధర్మనిష్ఠకు ప్రతీకలుగా భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచారని అన్నారు.ముఘల్ పాలకుడు వజీర్ ఖాన్ వారి మీద ఇస్లాం మతంలోకి మారాలని ఒత్తిడి చేయగా ధర్మాన్ని వదిలిపెట్టడం కన్నా మరణమే మాకు శ్రేయస్కరం అని స్పష్టంగా ప్రకటించి, చివరికి గోడలో సజీవంగా చేర్చబడి అమరులైన ఈ బాల వీరుల త్యాగం భారతదేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా అపూర్వమని పేర్కొన్నారు. పిల్లల్లో ధైర్యం, దేశభక్తి, ధర్మంపై అచంచలమైన విశ్వాసాన్ని పెంపొందించేందుకు భారత ప్రభుత్వం ఈ దినాన్ని ‘వీర్ బాల్ దివస్’గా ప్రకటించిందని తెలిపారు.ఈ వీర బాలుల త్యాగం నేటి యువతకు స్ఫూర్తిదాయకమని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, మోర శ్రీహరి, ప్రధాన కార్యదర్శిలు, మెరుగు శ్రీనివాస్, కొండా నరేష్,అధికార ప్రతినిధి దూడం సురేష్, దేవరాజు, సూరం వినయ్, వెంకటేష్, వంతుడుల సుధాకర్, బాలకిషన్, గాలి శ్రీనివాస్, వడ్నాల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.