బేతేలు ప్రార్థన మందిరం ప్రత్తిపాడు లో ఘనంగా క్రిస్మస్ వేడుక

★ ముఖ్యఅతిథిగా నియోజకవర్గ శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ రాజా ★ క్రిస్మస్ సందేశం అంతర్జాతీయ వాక్యోపదేశకులు రెవః జార్జి బుష్

పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్, డిసెంబర్ 27:- కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు గ్రామం ప్రత్తిపాడు తోట వీధి బేతేలు మందిరం లో క్రిస్మస్ వేడుక ను ఘనంగా నిర్వహించారు. ఈ క్రిస్మస్ వేడుకకు ముఖ్య అతిథిగా ప్రత్తిపాడు శాసనసభ్యురాలు వరుపుల సత్య ప్రభ పాల్గొన్నారు. క్రిస్మస్ ను ప్రపంచమంతటా కుల మత బేధాలు లేకుండా ప్రతి ఒక్కరూ ఆనందంగా జరుపుకునే అతిపెద్ద పండుగ. ఏసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఏసుక్రీస్తు ప్రతి ఒక్కరి పట్ల కరుణ, ప్రేమ, దయ కలిగి ఉండాలని చెప్పడమే కాకుండా ఆచరించి చూపారని క్రిస్మస్ గ్రీటింగ్స్ అందించారు. నియోజకవర్గంలో మత పరమైన విభేదాలు లేకుండా అందరూ సోదర భావంతో కలిసి ఉండాలని ఎవరికి ఏ కష్టం వచ్చినా నా ఇంటి తలుపులు తెరిచి ఉంటాయని భరోసా ఇచ్చారు. అనంతరం బేతేలు ప్రార్థన మందిరం సంఘ కాపరి రెవః ఆర్. సాలెమ్ రాజ్ సత్య ప్రభ రాజా ను దుశ్శాలువతో సన్మానించారు. అనంతరం క్రిస్మస్ సందేశం రెవః జార్జి బుష్ అందించగా వివిధ గ్రామాల నుండి వచ్చిన విశ్వాసులు బేతేలు సంఘం వారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఏసుక్రీస్తు పుట్టినరోజు వేడుకను తిలకించారు. ఈ వేడుకకు కూటమి నాయకులు యాళ్ల జగదీష్, శేట్టీబత్తుల వీరబాబు, మూర సత్య నారాయణ వరప్రసాద్ ( చంటి ), శెట్టి బత్తుల నాని బాబు, తదితరు నాయకులు. పలు సంఘాల దైవజనులు పాల్గొన్నారు.