బోధన్ పట్టణంలో కాగడలు ర్యాలీ

★ ర్యాలీ నిర్వహిస్తున్న విశ్వహిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాగడాల ర్యాలీ

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 27 బోధన్ :విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో శుక్రవారం బోధన్ పట్టణంలో కాగడాల ర్యాలీ నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం పట్టణంలోని పెద్ద హనుమాన్ ఆలయం నుండి అంబేద్కర్ చౌరస్తా మీదుగా కొత్త బస్టాండ్ చేరుకుని తిరిగి అంబేద్కర్ చౌరస్తా వరకు కాగడల ర్యాలీ చేపట్టారు. బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న మారణ హత్యా ఖాండను నిరసిస్తూ ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్బంగా బంగ్లాదేశ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. బంగ్లాదేశ్ లో ఉన్న మైనారిటీలో హిందువులకు ప్రత్యేక చట్టం తీసుకురావాలన్నారు.