పయనించే సూర్యుడు డిసెంబర్ 27(మేడ్చల్ నియోజకవర్గం మాధవరెడ్డి) మేడ్చల్ నియోజకవర్గం మేడిపల్లి వార్డ్ పరిధిలోని పర్వతాపూర్ సాయి ఐశ్వర్య కాలనీలో నివాసముండే సుజాత శ్రీనివాస్ నాయక్ దంపతుల కుమార్తె కావ్య శ్రీ మహిళా క్రికెట్లో తెలంగాణ రాష్ట్ర కెప్టెన్ గా రాణించి భారత అండర్ 19 టీం తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న కావ్య శ్రీ కి వైయస్సార్ ట్రస్ట్ ద్వారా 50వేల రూపాయల సహాయాన్ని అందించిన ఏనుగు సుదర్శన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలో సమున్నత స్థానానికి చేరుతున్న భారతదేశం కీర్తి పతాకను ఎగరవేయడంలో మహిళా మణులు కూడా తమ వంతు పాత్రను పోషించడం గర్వకారణం రెక్కలు విప్పిన విహంగంలా ఆకాశమే హద్దుగా మహిళా క్రికెట్లో దూసుకెళ్తున్న సమాజంలో అమ్మాయిలకు ఉండే అనేక ఆటుపోట్లను ఇబ్బందులను సగర్వంగా ఎదిరించి జాతీయస్థాయిలో రాణిస్తున్న కావ్య శ్రీ కి వెన్నుముకగా నిలిచి అన్ని విధాలుగా అండగా ఉన్న తల్లిదండ్రులు సుజాత మరియు శ్రీనివాస్ నాయక్ గొప్ప చైతన్యవంతులు.ఈ తల్లిదండ్రులు తమ కుమార్తె ఇష్టాన్ని గౌరవించి ముందుకెళ్లడంలో అందించిన ప్రోత్సాహం సమాజంలో మిగతా తల్లిదండ్రులకు స్ఫూర్తిదాయకం కావ్య శ్రీ కూడా శారీరక శ్రమతో కూడిన క్రికెట్ లాంటి రంగాన్ని ఎంచుకొని ముందుకు సాగుతున్న క్రమంలో శారీరకంగా దెబ్బలు తగిలినప్పటికీ మనోధైర్యంతో ముందుకెళ్లడం అభినందనీయం.కావ్య శ్రీ మా ప్రాంత బిడ్డ అయినందుకు నాకు కూడా గర్వంగా ఉంది ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు రామోజీ, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు బండారు పవన్ రెడ్డి, ఎస్సీ మోర్చా అధ్యక్షులు కర్ణాకర్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు గోంగూల బాలేష్, జిల్లా సెక్రటరీ జైపాల్ రెడ్డి, వార్డ్ జనరల్ సెక్రటరీ బల్ రెడ్డి, ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, సీనియర్ నాయకులు గూడెం సత్యనారాయణ గౌడ్, శేఖర్ గౌడ్, బీజేవైఎం మోహన్ యాదవ్, జస్వంత్ గౌడ్,సాయి మరియు బిజెపి నాయకులు పాల్గొనారు.