పయనించే సూర్యుడు, డిసెంబర్ 27 2025, నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ నాయకులు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ నివాసంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి సహకారంతో బాధితులకు ముఖ్య మంత్రి సహాయనిది చెక్కులను కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ 8 మంది లబ్ధిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నిరుపేద ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేశారు. బాధితులు సునపు సాయికిరణ్, సంపంగి మంజుల, మహిముబా బేగమ్, మెహరాజ్ బేగమ్, చిమరాల లింగమయ్య, ధ్యాప మాధురి, జంగిలి వంశీ కృష్ణ, బీ పద్మం లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ ఎర్ర శ్రీను, వార్డ్ మెంబర్ సభ్యులు మసిగుండ్ల వెంకటేష్, గుద్దటి కిష్టల్, మారేపల్లి శ్రీను, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు క్యాసరపు వెంకటయ్య, పుట్ట యాదయ్య, రేవల్లి దరగయ్య, కాటమొని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.