యూరియా పంపిణీ కేంద్రాన్ని ప్రారంభించిన సర్పంచ్ కొమ్ము ప్రభు

పయనించే సూర్యుడు డిసెంబర్ 27,(చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నాగులవంచ వారిచే చింతకాని మండలపరిధిలోని తిమ్మినేనిపాలెం గ్రామంలో యూరియా పంపిణీ కేంద్రాన్ని సర్పంచ్ కొమ్ము ప్రభు ప్రారంభించారు. ఈ సందర్భంగా పి ఏ సి ఎస్ నాగులవంచ సి ఈ ఓ శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులు ఇబ్బంది పడకుండా గ్రామంలోనే పంపిణీ కేంద్రాన్ని ఏర్పాటు చేసిందని రైతు సోదరులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొమ్ము ప్రభు,నాగులవంచ సొసైటి మాజీ అధ్యక్షులు నల్లమోతు శేషగిరి రావు, తిర్లాపురం సర్పంచ్ వీరబాబు, డైరెక్టర్లు ఆళ్ల శ్రీనివాసరావు, నాదెండ్ల వెంకటరత్నం గ్రామరైతులు నరేశ్ బాబు,బద్రి కాశి, గోగుల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.