రెండు నెలలుగా పలుచోట్ల పాల గేదెల దొంగతనాలు (రైతుల ఆందోళన)

పయనించే సూర్యుడు 27-12-2025 ఎన్ రజినీకాంత్:- మండల పరిధిలో గత రెండు నెలలుగా పాల గేదెల దొంగతనాలు వరుసగా కొనసాగుతుండటం రైతుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసింది. అక్టోబర్‌లో శిఖ జేమ్స్ అనే రైతుకు చెందిన మూడు పాడి గేదెలను దొంగలు ఎత్తుకెళ్లగా, డిసెంబర్‌లో గోపాలపూర్ గ్రామానికి చెందిన కంచర్ల రాజేందర్ అనే రైతు మూడు పాల గేదెలను కొత్తపల్లి గ్రామ శివా లోని తన కొట్టంలో దొంగిలించడం జరిగింది.తాజాగా ముత్తారం గ్రామానికి చెందిన ఏనుగు సత్తిరెడ్డి అనే రైతు గేదె బుధవారం రాత్రి దొంగలకు గురైనట్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వరుస దొంగతనాలతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇకనైనా పోలీసులు నిఘా పెంచి దొంగలను అరెస్టు చేసి రైతులను రక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ముల్కనూర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎమ్ రాజు మాట్లాడుతూ.. ఈ వరస పాల గేదెల దొంగతనాల జరుగుతున్న నేపథ్యంలో రైతులకు అండగా నిలుస్తామని, దీని కొరకు ప్రత్యేకమైన నిఘ టీం ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.. రైతులు తమ వ్యవసాయ భూమి వద్ద సిసి నిఘ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు..