లాంగ్ వాల్ పనులను త్వరితగతిన పూర్తి చేయండి

★ డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్యనారాయణ

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి సెంటినరీ కాలనీ:27 నిర్దేశించిన సమయంలో లాంగ్ వాల్ పనులను పూర్తి చేయాలని డైరెక్టర్ ఆపరేషన్స్ ఎల్.వి. సూర్య నారాయణ అన్నారు.వారు శుక్రవారం అడ్రియాల లాంగ్ వాల్ గనిని సందర్శించారు. అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు నిర్దేశించిన సమయంలో లాంగ్ వాల్ పనులను పూర్తి చేయడానికి తీసుకొంటున్న చర్యలను వివరించారు. అనంతరం డైరెక్టర్ ఆపరేషన్స్ లాంగ్వాల్ 3వ ప్యానెల్ సాల్వేజింగ్ పనుల పురోగతి, 4వ ప్యానెల్ తయారీ పనుల పై చర్చించి, భద్రత పై పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.తదుపరి వారు గనిలోనికి వెళ్లి పాత లాంగ్ వాల్ పనులను, నూతన ప్యానల్ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లాంగ్వాల్ సాల్వెజింగ్ పనులు నిర్దేశించిన ఈ సందర్భంగాసమయంలో పూర్తిచేసి, లాంగ్ వాల్ నుండి భద్రతతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించాలని అందుకు తగిన చర్యలు చేపట్టాలని పలు సలహాలు, సూచనలు ఇచ్చారు. వారితో పాటు కార్పోరేట్ సేఫ్టీ జనరల్ మేనేజర్ కె.సాయిబాబా, రామగుండం రీజనల్ సేఫ్టీ జనరల్ మేనేజర్ ఎస్.మధుసూదన్, ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, ఎస్వోటుజిఎం బండి సత్య నారాయణ, ప్రాజెక్ట్ ఇంజినీర్ టి.రఘురాం, సర్వే అధికారి హన్మండ్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.