విశ్రాంత ఉద్యోగులకు సన్మానం

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 నేరేడుచర్ల మండల ప్రతినిధి (చింతల శ్రవణ్) నేరేడుచర్ల, న్యూస్:- పెన్షన్లకు సామూహిక జన్మదిన వేడుకలు చేసినట్లయితే వారు ఆనందంతో పాటు శారీరకంగా ఉత్సాహ వంతులుగా మారతారనీ సంఘం మండల అధ్యక్షుడు పూర్ణచంద్రారెడ్డి అన్నారు. నేరేడుచర్ల లొని పెన్షనర్ల భవన్లో సంఘం మండల అధ్యక్షుడు పూర్ణచంద్ర రెడ్డి అధ్యక్షతన విశ్రాంతి ఉద్యోగులకు సామూహిక జన్మదిన వేడుకలను సందర్భంగా విశ్రాంత ఉద్యోగి చింతల మల్లయ్య, లక్ష్మీ దంపతులకు జన్మదినం జరుపుకుంటున్న వారికి సన్మానం జరిపారు అనంతరం కేక్ కట్ చేసి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం చొరవ చూపాలని అన్నారు. ఇలాంటి కార్యక్రమాలు వృద్ధాప్యంలో ఉల్లాసాన్ని కలిగిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పి సత్యనారాయణ కోశాధికారి బుద్ధారెడ్డి, అసోసియేట్ అధ్యక్షుడు సిహెచ్ వీరభద్ర రావు, గౌరవ అధ్యక్షులు రమణారావు, ప్రచార కార్యదర్శి రామస్వామి, సహాయ కార్యదర్శి వెంకటేశ్వర్లు, లక్ష్మీకాంతమ్మ, ఉపాధ్యక్షుడు లక్ష్మారెడ్డి జిల్లా కౌన్సిలర్ వీరారెడ్డి, భవన నిర్మాణ కార్యదర్శి రంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు రాంబాబు జిల్లా ప్రధాన కార్యదర్శి శ్యాంసుందర్ రెడ్డి జిల్లా కోశాధికారి అమిత్ ఖాన్, జిల్లా సహాయ కార్యదర్శి సుందరయ్య తదితరులు పాల్గొన్నారు.