శతజయంతి ఉత్సవాల సందర్భంగా పల్లె పల్లెలో రెపరెపలాడిన ఎర్రజెండా

★ భారత గడ్డపై ఎర్ర జెండాకు వందేళ్లు ★ జనవరి 18న ఖమ్మంలో జరిగే శత జయంతి ఉత్సవాలను జయప్రదం చేయండి ★ మరో వందేళ్లయినా ప్రజా సమస్యలపై పోరాటం కొనసాగుతుంది

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) 100 సంవత్సరాలు పూర్తి చేసుకునీ 101 సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అశ్వారావుపేట మండలంలో అన్ని గ్రామ శాఖలలో సిపిఐ అరుణ పతాకాన్ని ఎగరవేయడం జరిగింది. గత శతాబ్ది కాలంగా ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో ఉద్యమాలను, పోరాటాలను చేస్తూ ఎటువంటి అధికారం లేకపోయినా ప్రజలతో మమేకమై పనిచేస్తూ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని ముందుకు సాగుతూ వస్తున్న ఏకైక పార్టీ సిపిఐ పార్టీని అని సిపిఐ పార్టీ శ్రేణులు వాపోతున్నాయి. భారత స్వాతంత్రోద్యమం, తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమాలలో ముఖ్య భూమిక పోషించి తమదైన ముద్రను ఏర్పరచుకొన్న ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి దక్కుతుంది. భారతదేశ చరిత్రలో ఏ పార్టీకి లేని ఈ వందేళ్ళ చరిత్ర ఘనత భారత కమ్యూనిస్టు పార్టీకి మాత్రమే దక్కుతుంది. ఎందరో అమరవీరుల ప్రాణ త్యాగాల ఫలితమే ఈ వంద ఏళ్ల చరిత్ర ,ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రమైన అశ్వరావుపేట లోని సిపిఐ పార్టీ ఆఫీసులో సిపిఐ జెండాను సిపిఐ మండల ఇంచార్జ్ గన్నిన రామకృష్ణ ఆవిష్కరించడం జరిగింది. శతజయంతి ఉత్సవాలు డిసెంబర్ 26న ఖమ్మం నడిబొడ్డున భారీగా లక్షలాదిమందితో జరగాల్సి ఉండగా, కొన్ని అనివార్య కారణాలవల్ల జనవరి 18 కి ఆ ఉత్సవాలను అట్టహాసంగా నిర్వహించేందుకు పార్టీ శ్రేణులు నిర్ణయించాయి. జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ పార్టీ శతజయంతి ఉత్సవాలను జయప్రదం చేయాలని సిపిఐ పార్టీ శ్రేణులు కోరుతున్నాయి.
ఈ కార్యక్రమంలో సిపిఐ అశ్వారావుపేట పట్టణ కార్యదర్శి నూకవరపు విజయ్ కాంత్, ఏఐటీయూసీ నాయకులు పి చిన్నారావు, శ్రీను, రామకృష్ణ మరియు కార్మిక వర్గాల నాయకులు ,సిపిఐ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు