శాంతి భద్రతలకు గస్తీ పెంపు ఎమ్మెల్యే నానాజీ

పయనించే సూర్యుడు డిసెంబర్ 27, కాకినాడ జిల్లా ప్రతినిధి కాకినాడ రూరల్ (బి వి బి) కాకినాడ నగర చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో గస్తీ ముమ్మరం చేసేలా పోలీస్ శాఖ కు దాతల సహాయంతో రెండు రక్షక వాహనాలను సమకూరుస్తున్నామని రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ తెలిపారు. కాకినాడ గుడారి గుంట పంతం నానాజీ నివాసం వద్ద స్వచ్ఛ భారత మిషన్ ద్వారా 10 లక్షల 37 వేలు తో కొవ్వాడ పంచాయతీకి, ఓ.ఎన్.జి. సి ద్వారా 10 లక్షల 37 వేలతో వాకలపూడి పంచాయతీ కి మొత్తం రెండు ట్రాక్టర్లను సమకూర్చమన్నారు. గ్రామ పంచాయతీల్లో డంపింగ్ యార్డ్ లు అందుబాటులో లేకపోవటం తో ట్రాక్టర్ల తో చెత్తను తరలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఓ పి.సతీష్, జనసేన త్రిమూర్తులు, కరెక్ట్ల గోవిందు, గేదెల చిన్నారావు,వాకలపూడి పంచాయతీ కార్యదర్శి పాండు రంగారావు, జనసేన నాయకులు పుల్లా శ్రీరాములు, వీరమహిళలు హేమ తదితరులు పాల్గొన్నారు.