శివాలయానికి రూ.5 లక్షల విరాళం

పయనించే సూర్యుడు, కోరుట్ల డిసెంబర్ 27 కోరుట్ల పట్టణంలోని శ్రీ అయ్యప్ప గుట్టపై నూతనంగా 3 కోట్ల వ్యయంతో అయ్యప్ప ఆలయ ఆవరణలో నిర్మించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ సహిత శ్రీ శివాలయానికి ఆధ్యాత్మిక సేవాతత్పరులు,వేల్ మురుగన్ నిలయం గురుస్వామి, అయ్యప్ప దేవాలయ కోశాధికారి, సౌమ్యుడు శ్రీ జుంబర్తి రమేష్-వర్ష దంపతులు రూ. 5,11,116/ లు విరాళం ప్రకటించి, 25 వేలు నగదు అందజేశారు. కుటుంబ సభ్యులు శివాలయ నిర్మాణంలో మీరు తమవంతు సహకారం అందించి పరమేశ్వరుని కృపకు పాత్రులు అవుతున్నారని ఎవరైనా ఇట్టి ఆలయ నిర్మాణ దైవ కార్యములో పాల్గొనదలచిన వారు అయ్యప్ప సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులను సంప్రదించాలని గురు స్వాములు ఆలయ శాశ్వత అధ్యక్షులు చిద్రాల నారాయణ, ఆలయ అధ్యక్షులు అంబటి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.