సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కేటాయింపు కొరకు కౌన్సిలింగ్

పయనించే సూర్యుడు న్యూస్: పెద్దపల్లి, సెంటినరీ కాలనీ-27 రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ నరేంద్ర సుధాకరరావు ఆదేశాల మేరకు రామగుండం-3, అడ్రియాల ప్రాజెక్టు ఏరియాలలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులకు సెంటినరీ కాలనీలో గల క్వార్టర్ల కేటాయింపు కొరకు శుక్రవారం సెక్యూరిటీ కార్యాలయ ఆవరణలో క్వార్టర్ల కేటాయింపు కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. మొత్తము 195 ఖాళీ క్వార్టర్లు ఉండగా, మెడికల్, ఫ్రెష్ అలాట్మెంట్, చేంజ్ ఆఫ్ క్వార్టర్ల కొరకు 103 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా, 38 మంది ఉద్యోగులు హాజరై, 29 మంది క్వార్టర్లను ఎంపిక చేసుకున్నారు. వారికి త్వరలోనే క్వార్టర్ల కేటాయింపు పత్రాలు ఇస్తామని ఎస్వోటుజియం యం.రామ్మోహన్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాల నాయకులు డి.తిరుపతి రావు, సాయి కృష్ణ, ఇంచార్జ్ పర్సనల్ విభాగాధిపతి వి.సునీల్ ప్రసాద్, మెడికల్ సూపరిండెంట్ డాక్టర్ మహిపాల్, సివిల్ విభాగం అధికారి దుర్గం శ్రీనివాస్, ఎస్టేట్స్ విభాగం అధికారి మణిదీప్ రెడ్డి, క్వార్టర్ల విభాగం సిబ్బంది రమ్యారెడ్డి, మహేందర్, దాసు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *