సిపిఐ జెండా ఆవిష్కరణ

★ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయండి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏపూరి రవీంద్రబాబు

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). జనవరి 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు చింతకాని మండల వ్యాప్తంగా విరివిగా ప్రజలు హాజరై విజయవంతం చేయాలని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఏవూరి రవీంద్రబాబు పిలుపునిచ్చారు. సిపిఐ నూరు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా శుక్రవారం చింతకాని మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో నాగిలిగొండ సర్పంచ్ ఏవూరి పద్మ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో రవీంద్రబాబు మాట్లాడుతూ భారతదేశ గడ్డపై సిపిఐకి వందేండ్లన్నారు. దీనికి గుర్తుగా శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను నిర్వహిస్తున్నామని తెలిపారు. వందేండ్ల మహా ప్రస్థానంలో నిత్యం ప్రజాసమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు నిర్వహించిన చరిత్ర సిపిఐ సొంతమన్నారు.ఏ పార్టీకి లేని మన చరిత్ర సిపిఐ కి ఉందన్నారు. భూస్వాముల చెరనుండి లక్షలాది ఎకరాల భూములను స్వాధీనం చేసుకుని పేదలకు వంచిపెట్టిన మన చరితను లిఖించుకున్న సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభకు చింతకాని మండలం నుంచి అన్ని వర్గాల ప్రజలు అదిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండలం నుండి పురుషులు రెడ్ షర్ట్స్, మహిళలు ఎర్ర చీరలతో, డప్పు కోలాట నృత్యాలతో భారీగా ఖమ్మం తరలిరావాలన్నారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ నభ్యులు పావులూరి మల్లిఖార్జునరావు, కూచివుడి రవి, మండల కార్యదర్శి దూనరి గోపాలరావు, నహాయ కార్యదర్శి అబ్బూరి మహేష్, నాగిలిగొండ నర్పంచ్ ఏవూరి వద్మ, మండల కమిటీ సభ్యులు తాళ్లూరి యాదగిరి, గోగుల ఆది, షేక్ దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.