పయనించే సూర్యుడు డిసెంబర్ 27 కర్నూలు జిల్లా ఇంచార్జ్ శ్రీకాంత్ భారతదేశంలో బడుగు, బలహీన వర్గాల హక్కుల పరిరక్షణకై 1925 డిసెంబర్ 26న ఆవిర్భవించిన భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) శత జయంతి కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ ఎస్ సుదర్శన్ ఏఐటియుసిపట్టణ కార్యదర్శి బి వెంకన్న ఏఐఎస్ఎఫ్ డివిజన్ కార్యదర్శి దస్తగిరి మరాఠీ శాఖ కార్యదర్శి నాగరాజ్ సి.ఆర్.నగర్ సహకార దర్శి కే లింగప్ప భవన కార్మిక సంఘం నాయకులు షేక్షావలి ప్రజానాటక మండలి నాయకులు కె ఈరన్న తదితరులు పాల్గొని ఈ సందర్భంగా నేడు ఆదోనిలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ముందుగా ఆదోనిలోని సిపిఐ పార్టీ కార్యాలయం ఎదుట పార్టీ ఎస్ సుదర్శన్ పథకావిష్కరణ చేశారు అలాగే మరాటి గిరి నందు నాగరాజ్ నిజాముద్ద కాలనీ నందు ఏఎస్ఎఫ్ నాయకులు దస్తగిరి అంబేద్కర్ నగర్ పి షేక్షావలి క్రాంతి నగర్ కె విజయ్ కుమార్ సి ఆర్ నగర్ నందు టీ.వీరేష్ కల్లుబావి నందు కేఈరన్న గోవిందమ్మ పథకావిష్కరణ కార్యక్రమం చేపట్టారు. అనంతరం పట్టణంలోని వివిధ శాఖల వద్ద సిపిఐ నాయకులు పార్టీ పతాకాలను ఆవిష్కరించి, కమ్యూనిస్టు ఉద్యమం దేశ ప్రజల కోసం చేసిన రాజీలేని పోరాటాలను స్మరించుకున్నారు. సిపిఐ పార్టీ 100 సంవత్సరాల చరిత్రను కలిగి ఉన్నప్పటికీ నేటికీ సంజీవంగా, ప్రజా ఉద్యమ పార్టీగా కొనసాగుతుందని నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. రైతులు, కూలీలు, కార్మికులు, దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీలు, పేద మధ్య తరగతి వర్గాల హక్కుల కోసం సిపిఐ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తూ దేశ ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా, పట్టణ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యమ అభినందనలతో టి.వీరేష్ ఆదోని కార్యదర్శి