పయనించే సూర్యుడు 27-12-2025 ఎన్ రజినీకాంత్:- భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో సిపిఐ గ్రామ కార్యదర్శి సిపిఐ జెండా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు కామ్రేడ్ ఆదరి శ్రీనివాసులు మాట్లాడుతూ 1925 డిసెంబర్ 26న పుట్టిన సిపిఐ పార్టీ ప్రజల సమస్యల పరిష్కారం కోసం అలుపెరుగని పోరాటాలు, సమరాలు, త్యాగాలు సిపిఐ పార్టీ చేసిందని అన్నారు.. అమరుల రక్తంతో తడిసిన ఎర్రజెండా వంద సంవత్సరాలు అయిన రిపేరెపలడుతుందని, జనవరి 26 తేదీన ఖమ్మం లో జరిగే సిపిఐ శతవసంతాల సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.. ఈ సభకు 45 దేశాల కమ్యూనిస్టు నాయకులు లౌకిక వాదులు వామపక్ష నాయకులు వస్తున్నారని, ఐదు లక్షల మందితో జరిగే శత వసంతాల సభ ను విజయవంతం చేయాలని కోరారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ భీమదేవరపల్లి మండల కార్యదర్శి ఆదరి రమేష్, జిల్లా కౌన్సిల్ సభ్యులు గొంగల రామచందర్ రెడ్డి, కామ్రేడ్ రాగుల తిరుపతి, కామ్రేడ్ నడిగోటి సుధాకర్, కామ్రేడ్ పిట్టల రమేష్, కామ్రేడ్ ఆరెపల్లి, కొమరయ్య, కామ్రేడ్ రావుల చంద్రయ్య పాల్గొన్నారు..