సీనియర్ రాష్ట్రస్థాయి కబడ్డీ క్రీడాకారులకు క్రీడ దుస్తులు అందజేసిన పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్

పయనించే సూర్యుడు 27-12-2025 ఎన్ రజినీకాంత్:- హన్మకొండ జిల్లా మోడరన్ కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ జిల్లా కబడ్డీ క్రీడాకారులకు 12 మందికి క్రీడా దుస్తువులు అందజేసారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా క్రీడాకారులు రాబోయే రోజుల్లో రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయిలల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి, విద్యారంగంలో కూడా ముందుండాలని, అన్ని రంగాలలో రాణించాలని, కబడ్డీ క్రీడాకారులకు మంచి క్రీడ ప్రతిభ కనబరచాలని, తెలిపారు.. ఖమ్మం జిల్లాలో జరగబోయే రాష్ట్ర స్థాయి సీనియర్ మోడరన్ కబడ్డీ క్రీడల్లో ఈ నెల 26, 27, 28 తేదీలలో జరగబోయే రాష్ట్ర క్రీడల్లో మంచి క్రీడ నైపుణ్యాన్ని కనబరిచి, జాతీయ స్థాయికి ఎదగాలని ఎక్కడున్నా క్రమశిక్షణ నేర్చుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మాడ్రన్ జిల్లా కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పచ్చునూరి కరుణాకర్, జిల్లా కోశాధికారి సాతుర్ చంటి, సహాయ కార్యదర్శులు చాగంటి వెంకటేశ్వర్లు, బొల్లంపల్లి శ్యాం, తదితరులు పాల్గొన్నారు..