సీయోను ప్రార్ధనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు

పయనించే సూర్యుడు డిసెంబర్ 27 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట మండలంలోని గిరిజన గ్రామమైన అల్లిగూడెం గ్రామంలో ఉన్నటువంటి సియోను ప్రార్ధన మందిరంలో గురువారం క్రిస్టమస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్టమస్ పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రామంలో గల ప్రార్థనా మందిరాన్ని రంగులతో అలంకరించారు. ఈ క్రమంలో క్రిస్మస్ వేడుకలకు రామన్నగూడెం, పండువారిగూడెం, నాగులగుంపు, దిబ్బగూడెం, అల్లిగూడెం గ్రామాలకు సంబంధించిన సంఘస్తులకు బట్టలు పంపిణీ, చిన్నారులకు బహుమతులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. విశ్వాసుల ఆధ్వర్యంలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా చేసి మందిరంలో కొవ్వొత్తుల వెలుగులతో ప్రత్యేక ప్రార్ధనలు చేస్తూ క్రీస్తు గీతాలు ఆలపించారు. ఈకార్యక్రమంలో చర్చి పాస్టర్లు సున్నం సియోను కుమార్, నడ్డి దేవదాస్, నెహ్రూ అల్లిగూడెం సర్పంచ్ కుంజా శీను.ఉప సర్పంచ్ కేరం మంగా.మాజీ ఉప సర్పంచ్ బాబురావు నండ్రు రమేష్. ములగలంపల్లి రాజు ఎల్ రాజు శేఖర్ రాందాసు సువార్త సంగీత కీర్తి బాబు సమీప చిన్న లక్ష్మి దేవేంద్ర సాగర్ వసంతలక్ష్మి శ్యామల ప్రసాద్ సంఘ పెద్దలు గ్రామస్తులు, పెద్ద ఎత్తున యువత, పాల్గొన్నారు.