స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా వ్యక్తి కాదు ఒక మహాశక్తీ

★ స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా కి పూలమాలవేసి ఘన నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 27 జగయ్యపేట పట్టణంలోని ఈరోజు కీ|| శే|| వంగవీటి మోహన్ రంగ వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ సీపీ పట్టణ పార్టీ అధ్యక్షులు పఠాన్ ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో జగ్గయ్యపేట పట్టణంలో కోదాడ రోడ్డు నందు ఉన్న ఆయన విగ్రహానికి పార్టీ నాయకులతో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు అనంతరం పార్టీ నాయకులతో కలిసి పలు సేవా కార్యక్రమాల్లో భాగంగా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు రోగులకు, బాలింతలకు స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదల ఇల్లు కోసం 3రోజులుగా నిరహరదీక్ష చేస్తున్న ఒక వ్యక్తిని ఎదురుగా ఎదురుకొనే దమ్ము లేక రాక్షసనీతితో చీకటిలో అయ్యప్ప మాలలు వేసుకొని దొంగ దాడి చేసి మరి పొట్టన పెట్టుకున్నారు. గుండెలో బతికే ఉన్నాడు అని కొన్ని లక్షల మంది ఇప్పటికి అంటున్నారు, అతను వ్యక్తి కాదు ఒక మహాశక్తీ అని పేర్కొన్నారు. అతనే పేద ప్రజల ముద్దుబిడ్డ బెజవాడ బెబ్బులి "వంగవీటి మోహనరంగా" జనం మనిషి, తన జీవితం జనానికే అంకితం చేసారు, రంగా నటుడు కాదు కేవలం తన నోటి మాట ద్వారా లక్షల సంఖ్య లో జనాన్ని రప్పించిన ఘనత ఆయనకే చెల్లింది, మరి ఆ రోజుల్లో ఇప్పటిలా ఎలక్ట్రానిక్ మీడియా లేదు, సెల్ ఫోన్స్ లేకపోయినా కేవలం తన రంగా అనే పేరుకే జన ప్రభంజనం అయింది, రంగ గారు 37 ఏళ్ళు గడిచినా ఇప్పటికి వారి పేరు ప్రజలు గుండెలో పెట్టుకొని పూజిస్తున్నారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బూడిద నర్సింహారావు, రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి నంబూరి రవి, రాష్ట్ర లీగల్ సెల్ కార్యదర్శి పసుపులేటి సత్య శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి దర్శనాల వెంకటరమణ, సీనియర్ నాయకులు లహోరి బద్దు నాయక్, జిల్లా రైతు విభాగ కార్యదర్శి మోరే దుర్గాప్రసాద్, నియోజకవర్గ మహిళా విభాగ అధ్యక్షురాలు చల్లా సుశీల, మండల ఉపాధ్యక్షులు మెట్టు ఏడుకొండలు, సీనియర్ నాయకులు లాహోరి బద్దు నాయక్, పట్టణ ప్రధాన కార్యదర్శి పింగళి నరసింహారెడ్డి, పట్టణ కార్యదర్శి దార్ల ప్రసన్నకుమార్, పట్టణ క్రిస్టియన్ మైనార్టీ అధ్యక్షులు దారెల్లి మహేష్, పట్టణ ప్రచార విభాగ అధ్యక్షులు చింతమాల లక్ష్మణ్, పట్టణ దివ్యంగుల విభాగ అధ్యక్షులు పూర్ణ, బలుసుపాడు సర్పంచ్ యడ్లపల్లి సూరిబాబు, పట్టణ 11,17 వార్డుల అధ్యక్షులు శుంకర కేశవ, షేక్ ఖాదర్, పట్టణ యూత్ ప్రధాన కార్యదర్శి గొట్టిపాల సురేష్, మాజీ మార్కెట్ డైరెక్టర్ డైరెక్టర్ మన్నే అప్పారావు, మారిశెట్టి అనిల్, దారెల్లి రాజు, బండి రామాంజనేయులు, చింతల కాళేశ్వరరావు, రంగా అభిమానులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.