స్వర్గీయ వంగవీటి మోహన రంగా కి ఘనమైన నివాళులు

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జీల్లా జగయ్యపేట నియోజకవర్గం డిసెంబర్ 27 జగ్గయ్యపేట పట్టణంలోని ఈరోజు న హైదరాబాదు రోడ్డు నందు జగ్గయ్యపేట శ్రీ కృష్ణ దేవరాయ కమిటీ సభ్యులు ఏర్పాటు చేసిన బడుగు బలహీన వర్గాల ప్రజానేత స్వర్గీయ వంగవీటి మోహన రంగా 37వ వర్ధంతి కార్యక్రమం సందర్భంగా వారి విగ్రహానికి నివాళులర్పించిన ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు సామినేని ఉదయభాను . అనతరం కమిటీ వారు ఏర్పాటు చేసిన పేదలకు పండ్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉదయభాను మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన రంగా కుల, మతాలు, రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండెల్లో నిలిచారన్నారు. మొగల్రాజపురంలో పేద ప్రజల ఇళ్ల పట్టాలు విషయమై వెళ్తున్న రంగాను పోలీసులు అరెస్ట్ చేయడంతో నిరాహార దీక్ష చేశారని, నిరాహార దీక్షలో అగంతకుల చేతిలో రంగ హత్య చేయబడ్డారని అన్నారు. వంగవీటి రంగా స్ఫూర్తితో అనేక మంది రాజకీయాల్లో ఉన్నారని, వారి ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, శ్రీ కృష్ణ దేవరాయ కమిటీ సభ్యులు, రంగా అభిమానులు, జనసేన కార్యకర్తలు, వీరమహిళలు పాల్గొన్నారు.