1999 2000 సం,, 25 వసంతాల పదవ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఉపాధ్యాయులు కొచ్చర్ల కోట శ్రీరామచంద్రమూర్తి కి ఘన సత్కారం

పయనించే సూర్యుడు డిసెంబర్ 27, కాకినాడ జిల్లా ప్రతినిధి, కాకినాడ రూరల్ (బి వి బి) పి ఎన్ ఎం హై స్కూల్ హనుమంతరావు ఆధ్వర్యంలో కుకట్పల్లి పి ఎస్ ఎం హై స్కూల్ 1999 2000 సం,, పదవ తరగతి బ్యాచ్ విద్యార్థుల 25 సంవత్సరాల వసంతాల పూర్తి అయిన సందర్భంగా తమను ఇంత వృద్ధిలోకి తీసుకొచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు ఉపాధ్యాయులు శ్రీరామ చంద్రమూర్తి మాట్లాడుతూ పేద ప్రజలకు పేద విద్యార్థులకు యధాశక్తి గా సహాయ సహకారాలు అందించాలని భగవంతుని కృపకు పాత్రులు కావాలని కోరారు. ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు నరేందర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానం చేశారు.