పయనించే సూర్యుడు డిసెంబర్ 28, మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం రిపోర్టర్ నరిగె కళాశేఖర్: రాజాపూర్ మండలం ముదిరెడ్డి పల్లి గ్రామంలో అయ్యప్ప మాలధారణ చేసిన స్వాములకు గ్రామంలోని వీరాంజనేయ గుడి సన్నిధానంలో గోనయో పౌండేషన్ వ్యవస్థాపకులు వడ్ల ప్రశాంత్ చారి పూజలో దీపారాధనకు, పడిపూజ కు సంబంధించిన కంచార్థులు అయ్యప్ప స్వాములకు అందించారు. ఈ సందర్భంగా వడ్ల ప్రశాంత్ చారి మాట్లాడుతూ హిందూ ధర్మానికి రక్షణగా, కులాలకు అతీతంగా ధర్మాన్ని ఆచరిస్తూ ,దీక్షతో నిత్య ఆరాధనతో భక్తి శ్రద్ధలతో, పూజల్లో పాల్గొంటున్న అయ్యప్ప స్వాములందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. తెల్లవారుజామున లేచి చన్నీటి స్నానం ఆచరించి భక్తి భావంతో, ఎంతటి కష్టమైనా భరించి మాలధారణ చేసి నిత్యం అయ్యప్ప సేవకు నోచుకోవడం ఏ జన్మలో చేసుకున్న పుణ్యం అంటూ సన్నిధానం లో పూజలు నిర్వహిస్తున్న స్వాములకు తన వంతు భక్తితో అయ్యప్ప స్వామి పూజలకు కంచార్థులు బహుకరించడం చాలా సంతోషం అన్నారు. ఈ కార్యక్రమంలో గోనయో పౌండేషన్ వ్యవస్థాపకులు ప్రశాంత్ చారినీ, సామాజిక సేవలు చేస్తున్నందుకు గాను ముదిరెడ్డి పల్లి సన్నిధానం అయ్యప్ప స్వాములు శాలువాతో సత్కరించి అభినందనలు తెలియచేశారు.
