అశ్వాపురం రహదారి సెంట్రల్ లైటింగ్ త్వరగా పూర్తి చేయాలి

★ అశ్వాపురం సర్పంచ్ సదర్ లాల్

పయనించే సూర్యుడు, అశ్వాపురం, డిసెంబర్ 28: అశ్వాపురం మండలంలోని అశ్వాపురం మణుగూరు కొత్తగూడెం ప్రధాన రహదారి వెంబడి డివైడర్లు నిర్మాణము చేసి నాలుగు నెలలు అయిందని డివైడర్ల నిర్మాణ సమయంలో రోడ్డును తవ్వడం వలన రోడ్డు దెబ్బ తిన్నదని వాహనాలు రాకపోకలకు ప్రయాణికులకు రోడ్డుకు ఇరువైపుల ఉన్న వ్యాపార సముదాయాల వ్యాపార వర్గాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాహనాలు రాకపోకల సమయంలో వాహనాల వెంట దుమ్ము లేవడంతో ప్రయాణికులకు, వ్యాపారస్తులకు, కొనుగోలుదారులకు పలు అనారోగ్య కారణమైన వ్యాధులు ప్రబలి ప్రజలందరూ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఎట్టి పరిస్థితుల్లో త్వరితగతిన డివైడర్లకు ఇరువైపులా రోడ్డు నిర్మాణం చేపట్టి రెండు వైపులా రోడ్డును వేయాలని అన్నారు.రోడ్డు నిర్మాణం చేపట్టకపోవటం పలు రకాల వాహనాల బొగ్గు, పాత ఇనుము, ఇటుక, ఇసుక, ఇతరాత్ర వాహనాలు తిరగడం వల్ల లేచే దుమ్ము, గాలిలో కలిసి చలి కాలం కావడంతో గొంతులో మంట, దగ్గు, ఆస్తమా ఉన్నవారు పలు రోగాల బారిన పడి వేలాది రూపాయలు పెట్టి ఆసుపత్రుల చుట్టూ తిరగ వలసి వస్తున్నదని రోడ్డుకు ఇరువైపులా ఉన్న వ్యాపార సముదాయాలలో దుమ్ము పేరుకు పోయి ఇబ్బంది పడుతున్నారని కొనుగోలుదారులు, వాహనదారు లు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ప్రజలు అనారోగ్యానికి గురవుతున్న ఆర్ అండ్ బి అధికారులు చోద్యం చూస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రామపంచాయతీ సర్పంచ్ అయిన తనకు ప్రజలు వారి ఆరోగ్యాలు ముఖ్యం అని రోడ్డు నిర్మాణము వెంటనే చేపట్టకపోతే ప్రజలు విసిగెత్తిపోయి ఆగ్రహావేశాలకు గురికావాల్సి వస్తుందని, వారి ఆరోగ్యాలను కాపాడే బాధ్యత ప్రజా ప్రతినిధులగా మనందరిమీద ఉన్నది కావున వీలైనంత త్వరగా అశ్వాపురంలో రోడ్డు నిర్మాణం చేపట్టి అశ్వాపురం మండల ప్రజలలో వ్యాపారస్తులలో సంతోషాన్ని కలగ చేయాలని అశ్వాపురం గ్రామ సర్పంచ్ బానోత్ సదర్ లాల్ మరియు ఉప సర్పంచ్ తుళ్లూరి ప్రకాష్ రావులు శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు కు వినతిపత్రం అందించారు.