పయనించే సూర్యుడు డిసెంబర్ 28, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండల కేంద్రాల్లోని ప్రతినెల నాలుగవ శనివారం ఈసీసీఈ నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ప్రీ స్కూల్ పిల్లలు చేసిన యాక్టివిటీస్ తల్లిదండ్రులకు చేసి చూపించడం. టీచర్ స్వయంగా తయారుచేసిన టిఎల్ఎం మెటీరియల్ డిస్ప్లే చేయడం పిల్లల అభివృద్ధిల గురించి తల్లిదండ్రులతో చర్చించడం పిల్లల తల్లిదండ్రులకి కూడా ప్రీస్కూల్ యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ చేసి ఆటలు ఆడించడం. అలాగే గ్రామంలో పనిచేసే చేతివృత్తుల వాళ్లను కమ్మరి, కుమ్మరి, జానపద టైలరింగ్ వాళ్లను పిల్లలకు వాళ్లు చేసే పని గురించి అవగాహన కల్పించడం జరిగింది. వాళ్లు స్వయంగా తయారు చేసిన మెటీరియల్ పిల్లలకు అందించడం ఇలా పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రైమరీ హెడ్మాస్టర్ సీత, అంగన్వాడీ టీచర్స్ వడ్రానపు బేబీ, చిత్తలూరి భద్ర, అనూష, ఫ్రీ ప్రైమరీ ఇన్స్పెక్టర్ యరమల రామకృష్ణ, ఆయా లు, పిల్లలు తదితరులు పాల్గొన్నారు.