పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ డిసెంబర్ 28 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ పట్టణ కేంద్రానికి చెందిన ప్రగతి ఉన్నత పాఠశాల విద్యార్థులు ఈ-డాక్ ఇగ్నైట్ బుక్ సిరీస్ ఆధ్వర్యంలో హైదరాబాదులో రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన 75 పాఠశాలల విద్యార్థులచే నిర్వహించిన విద్యార్థుల ప్రతిభా పాటవాల గ్రాండ్ ఫైనల్ కార్యక్రమంలో అద్భుత ప్రతిభను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. విద్యా, సృజనాత్మక విభాగాల్లో విద్యార్థులు తమ నైపుణ్యాలను చాటుతూ ఉత్తమ ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు సాధించారు. చిన్న వయసులోనే ఆత్మవిశ్వాసం, విజ్ఞానం, సృజనాత్మకతకు నిదర్శనంగా నిలిచిన ఈ ప్రదర్శనలు ఉపాధ్యాయులు,తల్లిదండ్రుల ప్రశంసలు పొందాయి. విద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీయడమే లక్ష్యంగా ఈ-డాక్ ఇగ్నైట్ వేదికను రూపొందించిందని ఈ డాక్ వైస్ ప్రెసిడెంట్ శైలజ, నిర్వాహకులు కృపాకర్, అభిషాన్, అనామిక తెలిపారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ బాలె శేఖర్ మాట్లాడుతూ, “విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి, దానికి సరైన వేదిక కల్పిస్తే వారు అసాధారణ విజయాలు సాధిస్తారు. ఈ-డాక్ ఇగ్నైట్ వంటి కార్యక్రమాలు విద్యార్థుల సృజనాత్మకతను మరింత పెంపొందిస్తాయి. మా పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి వేదికపై ప్రతిభ చూపడం గర్వకారణం” అని అన్నారు. విద్యార్థుల విజయానికి కృషి చేసిన ఉపాధ్యాయ బృందాన్ని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ప్రగతి పాఠశాల విద్యార్థుల విజయంతో రాయికల్‌కు గర్వకారణమయ్యిందని స్థానికులు అభినందనలు తెలిపారు.