ఉట్నూర్‌లో గుండెపోటుతో లారీ డ్రైవర్ మృతి

పయనించే సూర్యుడు డిసెంబర్ 28 ఉట్నూర్ ఉట్నూర్:- ఉపాధి కోసం వచ్చిన లారీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందిన విషాద ఘటన ఉట్నూర్‌లో శుక్రవారం చోటుచేసుకుంది ఏపీ తూర్పుగోదావరి జిల్లా గణపవరానికి చెందిన సత్యనారాయణ కొబ్బరి బోండాల లోడుతో ఉట్నూర్‌కు వచ్చారు సరుకు దించుతున్న సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు స్థానికులు వెంటనే స్పందించి ఆయనను సమీపంలోని ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సత్యనారాయణ మృతి చెందారు. కుటుంబ పోషణ కోసం వలస వచ్చి పరాయి గడ్డపై ప్రాణాలు కోల్పోవడం స్థానికులను కలచివేసింది.