ఉప సర్పంచ్ ల సంఘం జిల్లా అధ్యక్షులుగా మహంకాళి

పయనించే సూర్యుడు, డిసెంబర్ 28 ,బూర్గంపాడు మండల రిపోర్టర్ పోతుగంటి రామ్ ప్రసాద్ ఉప సర్పంచుల సంఘం జిల్లా అధ్యక్షులుగా బూర్గంపహాడ్ మండల పరిధిలోని ఇరవెండి గ్రామపంచాయతీ ఉప సర్పంచ్ మహంకాళి రామారావుని నియమిస్తూ రాష్ట్ర ఉప సర్పంచ్ల సంఘం అధ్యక్షులు రాములు నాయక్ శనివారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ తనమీద నమ్మకంతో తనకు అప్పగించిన రాష్ట్ర ఉప సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు రాములు నాయక్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. జిల్లాలో ఎన్నికైన ఉప సర్పంచులకు ప్రతినిధిగా అప్పగించిన బాధ్యతను ఉపసర్పంచుల గౌరవాన్ని తగ్గించకుండా గ్రామాల అభివృద్ధిలో పోటీపడి మంచి పేరు తెచ్చుకునే విధంగా ఉప సర్పంచ్ ల అందరిని సంఘటితం చేస్తానని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలలో ఉప సర్పంచులకు ప్రత్యేక ప్రోటోకాల్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరతామని పేర్కొన్నారు.