పయనించే సూర్యుడు డిసెంబర్ 28 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట మండలం పాతనారంవారిగూడెం గ్రామంలో అశ్వారావుపేట గవర్నమెంట్ జూనియర్ కళాశాల విద్యార్థులతో నేషనల్ సర్వీస్ స్కీం ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన (వింటర్ క్యాంపు) కార్యక్రమంలో ఎమ్మెల్యే జారె ఆదినారాయణ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్ ఎస్ ఎస్ క్యాంపుల ద్వారా విద్యార్థుల్లో సేవాభావం సామాజిక బాధ్యత పెంపొందుతుందన్నారు గ్రామాల అభివృద్ధిలో యువత పాత్ర కీలకమని పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణ ఆరోగ్యం సామాజిక అవగాహన కార్యక్రమాల్లో విద్యార్థులు చురుగ్గా పాల్గొనాలని సూచించారు ప్రభుత్వ విద్యాసంస్థల్లో చదువుతున్న విద్యార్థులు క్రమశిక్షణతో పాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకుంటే మంచి పౌరులుగా ఎదుగుతారని తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న ఇలాంటి క్యాంపులు ప్రజలకు మేలుచేస్తాయని ప్రశంసించారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు తుమ్మా రాంబాబు ఆత్మ కమిటీ చైర్మన్ సుంకవల్లి వీరభద్ర రావు సర్పంచ్ మునుగొండ నాగమణి జూనియర్ కళాశాల సిబ్బంది కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు