పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 27 మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మందమర్రి మండల నికి చెందిన పెద్ది రాజన్నను ఎస్సీ, ఎస్టీ మానిటరింగ్ సభ్యులుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి నియమించారు.ఈ సందర్భంగా కార్మిక శాఖ మంత్రి కి పెద్ది రాజన్న కృతజ్ఞతలు తెలుపుతూ నాపై నమ్మకంతో ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులుగా చేర్చుకున్నందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ యొక్క ఆత్మీయ సన్మాన కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి సదానందం యాదవ్, రాగిడి రామిరెడ్డి, దశరథం, నాగుల దుర్గన్న, పార్టీ శ్రేణులు తదితరులు శాలువాతో సత్కరించారు.